నూతన ఎస్సైని కలిసిన పిఎసిఎస్ చైర్మన్, డైరెక్టర్లు
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, పట్టణం పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా వచ్చిన బుగ్గ శ్రీశైలంని బుధవారం పోలీస్ స్టేషన్ లో పిఎసిఎస్ చైర్మన్ గూదె బాల నరసింహ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్లు మోకు మధుసూదన్ రెడ్డి, కొండోజు ఆంజనేయులు, ముదిగొండ శ్రీనివాస్, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గుండ్లపల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.