కరెంట్ షాక్తో రైతు మృతి
భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో పెంజర్ల నర్సింలు అనే రైతు కరెంటు షాక్తో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింలు వ్యవసాయ బావి వద్ద పొలం పనులు చేస్తూ మోటారు ఆన్ కావటం లేదని చూస్తున్న క్రమంలో కరెంటు వైర్ తగిలి మరణించినట్లు తెలిపారు.