ఢిల్లీ వాసులను గాలి కాలుష్యంతోపాటు.. నీటి కొరత తీవ్ర ఇబ్బంది పెడుతోంది. నగరంలో యమునా నది కాలుష్యంతో నురగలు కక్కుతోన్న విషయం తెలిసిందే. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, మురుగునీటిని వదులుతుండటంతో యమునా నదిలో విషపూరితమైన తెల్లటి నురగ ప్రవహిస్తోంది. నదిలో అమ్మోనియా సాంద్రత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. దీంతో పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.