ఎస్కలేటర్ పై బైక్ నడుపుతున్న యువకుడు (షాకింగ్ వీడియో)

1044చూసినవారు
ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రోలో స్టేషన్స్ లో యువతి, యువకులు రీల్స్ చేస్తూ సోషల్ మీడియా పట్టాలెక్కుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నా కూడా రీల్స్ చేయడం ఆపడం లేదు. తాజాగా ఢిల్లీ మెట్రోలోని ఉన్న ఎస్కేలేటర్ పైకి ఓ యువకుడు ఏకంగా బైక్ ఎక్కించి నడుపుతున్నాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.