పిక్నిక్‌కు వెళ్లిన కొందరు యువకులు తమ వెంట తీసుకెళ్లిన ఆవును చంపి వండుకుని తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అసోంలోని కామరూప్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసల్పారా గ్రామానికి చెందిన యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులను సాహిల్ ఖాన్ (20), హఫీజుర్ (19), రోకిబుల్ హుస్సేన్ (20), సాహిదుల్ ఇస్లాం (30), ఇజాజ్ ఖాన్ (26), జాహిదుల్ ఇస్లాం (24)గా గుర్తించారు.