తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదంతో రౌడీలు ఓ యువకుడిని దారుణంగా కొట్టి కాల్వలో పడేశారు. బాధిత యువకుడు దాల్మావు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోయిలి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాలువలో పడి ఉన్న యువకుడిని గమనించిన స్థానికులు అతడిని నీటిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.