కేరళలో బయటపడ్డ జికా వైరస్ కేసులు

82చూసినవారు
కేరళలో బయటపడ్డ జికా వైరస్ కేసులు
కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్‌ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. మొదట ఒక 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్‌ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టుగా తేలింది. జికా ఇన్ఫెక్షన్‌ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్‌ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్