
నటుడు సోనూసూద్ భార్యకు ప్రమాదం.. తీవ్ర గాయాలు!
బాలీవుడ్ నటుడు సోనూసూద్ భార్య సోనాలి సూద్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం ముంబై-నాగ్‌పూర్ హైవేపై జరిగిన ఒక యాక్సిడెంట్ లో ఆమె గాయపడ్డారు. ఆమెను వెంటనే నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి సోను సూద్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.