
లక్ష్మీదేవీ అనుగ్రహం పొందాలంటే ఈ తప్పులు చేయకండి
లక్ష్మీదేవీ అనుగ్రహం పొందాలంటే కొన్ని తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు. సోమవారం నాడు తలకు నూనె రాయకూడదు, మంగళవారం పూట మహిళలు పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లకూడదు. శుక్రవారం కోడలు అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్లకూడదు. గోళ్ళను ఇంటి బయట మాత్రమే కట్ చేయాలి. తులసి ఆకులను మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో కోయకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం, తల దువ్వుకోవడం వంటివి చేయరాదు. అలాగే పెరుగు, ఉప్పు అప్పుగా ఇవ్వకూడదు.