విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఫ్లైట్‌ను నిలిపేసిన అధికారులు

64చూసినవారు
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఫ్లైట్‌ను నిలిపేసిన అధికారులు
తిరువనంతపురం విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కేరళ నుంచి 179 మంది ప్రయాణికులతో ఓ ఫ్లైట్ బెంగళూరు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. టేకాఫ్ అవడానికి కొద్ది నిమిషాల ముందు ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు ఫ్లైట్‌ను రద్దు చేశారు. చివరికి ప్రయాణికులను మరో ఫ్లైట్‌లో బెంగళూరుకు పంపించారు.

సంబంధిత పోస్ట్