ఏడు కొండల వాడి సాక్షిగా దేవుడు ఉన్నాడు అని నిరూపించిన భక్తుడు

108చూసినవారు
ఏడు కొండల వాడి సాక్షిగా దేవుడు ఉన్నాడు అని నిరూపించిన భక్తుడు
సూర్యపేట జిల్లా హుజూర్నగర్ మండలం లకారం గ్రామానికి చెందిన కొంపల్లి కనకా రెడ్డి మే 25 తారీఖున 30మంది కోలాట బృందాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకువెళ్లాడు. శ్రీవారి దర్శనం, స్వామివారి ఊరేగింపులో కోలాటం
వేసేటప్పుడు కనకా రెడ్డి కి చెందిన పర్సు పోయినది. అందులో పది వేల రూపాయల నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉన్నవి . ఆ పర్సు కోదాడ వాసి కమతం వెంకటేశ్వర్లుకు దొరికింది దర్శనం అయ్యాక ఓపెన్ చేసి అందులో ఉన్న ఆధార్ కార్డు ప్రకారం అతని సెల్ నెంబర్ సేకరించి, ఆరా తీసి నిర్ధారించుకుని ఈరోజు పబ్లిక్ క్లబ్ లో రెడ్డి సంఘం అధ్యక్షులు మాజీ పబ్లిక్ కార్యదర్శి రెడ్డి గారి చేతుల మీదుగా కనకా రెడ్డి కి అందజేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్