
తీవ్ర వడగాల్పులు.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త
AP: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం అల్లూరి జిల్లాలోని కూనవరం, వరరామచంద్రపురం, వేలేర్పాడు, మన్యం జిల్లాలోని పాలకొండ, సీతంపేట, లక్ష్మీనర్సుపేట, బూర్జ, హీరా మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 62 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.