Rain Alert: తమిళనాడులో భారీ వర్షాలు
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను అధికారులు ప్రకటించారు. మధురైలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల వారిని తరలించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.