ALERT: 24 గంటల్లో మంచు చరియలు విరిగిపడే ప్రమాదం (VIDEO)

80చూసినవారు
దక్షిణాదిలో ఎండలు మండిపోతుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌‌ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో నిరంతరం మంచు కురుస్తోంది. తాజాగా చమోలి, రుద్రప్రయాగ్‌, పిథోగఢ్‌ జిల్లాల్లో సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలకు అధికారులు అవలాంచ్‌ హెచ్చరికలు చేశారు. రాబోయే 24 గంటల్లో ఇక్కడ మంచు చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్