14 నుంచి భారీ వర్షాలు

ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని సమాచారం. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్