చీడికాడ మండలం కోణం రిజర్వాయర్ ని మంగళవారం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సందర్శించి అక్కడ నెలకొన్న పరిస్థితిని తెలుసుకున్నారు. భారీ వర్షాల మూలంగా జలాశయంలో తలెత్తిన సమస్యలు, ప్రస్తుతం నీటి నిల్వలు, ఇప్పటివరకు విడుదల చేసిన నీటి వివరాలు తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల తుపాను ధాటికి ఖండివరంలో కొట్టుకుపోయిన రోడ్ ను పరిశీలించి ప్రత్యామ్నాయ చర్యల గురించి చర్చించారు.