చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో సిటీజన్ చార్టర్ ను పటిష్ఠంగా అమలు చేయాలని కమిషనర్ శ్రీహరి బాబు పేర్కొన్నారు. చిలకలూరిపేటలో మంగళవారం పన్ను బకాయిలపై రెవెన్యూ అధికారులు, సచివాలయ అడ్మిన్లతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటి నంబర్లు కేటాయింపు, ఆస్తి పేరు మార్పిడి, బైఫర్కేషన్, కొత్త ఆసేస్మెంట్ తదితర వినతులు, సమస్యలను గడువులోగా పరిష్కరించాలన్నారు.