గుంటూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం లైన్ క్లియర్ అయిందని కమిషనర్ పి. శ్రీనివాసులు తెలిపారు. గుంటూరు అరండల్ పేట ఆర్బి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని చెప్పారు. ఆర్బి నిర్మాణం వలన నష్టం కలిగే ప్రతి ఒక్కరికీ తగిన నష్ట పరిహారం అందిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. గురువారం ఆర్బి నిర్మాణ ప్రభావిత ప్రైవేట్ భవన యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.