వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో శుక్రవారం అలజడి వాతావరణం నెలకొంది. తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో సముద్రం కొద్ది అడుగుల మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. సముద్ర నీటి ప్రవాహంతో తీరం ఓడ్డు కోతకు గురైంది. భక్తులు రామాపురం తీరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.