చిలకలూరిపేట: దుకాణదారులు నిబంధనలు పాటించాలి: శ్రీహరిబాబు

దీపావళి సందర్భంగా దుకాణాలు ఏర్పాటు చేసేవారు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ. అధికారులు సూచించిన ప్రదేశాలలో మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. దుకాణాల వద్ద ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్