గుంటూరు: ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులపై దాడి

గుంటూరులోని అరండల్ పేటలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీపై వినియోగదారుడు దాడికి పాల్పడ్డాడు. సదరు ఇన్సూరెన్స్ కంపెనీలో వినియోగదారుడికి రావాల్సిన నగదు ఆలస్యం కావడంతో మంగళవారం ఇన్సూరెన్స్ కంపెనీలోని ఉద్యోగులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్