గుంటూరు నగరపాలక సంస్థ వెహికల్ షెడ్డులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ముత్తయ్యపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జీఎంసీ కమిషనర్ పులి. శ్రీనివాసులను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ ఈ ఘటనపై పోలీస్ శాఖచే దర్యాప్తు చేయించి దుండగులను శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు.