గుంటూరు పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో పోలీస్ కార్యాలయానికి తరలివచ్చారు. ఎస్పీ సతీశ్ కుమార్, ఏఎస్పీ రమణమూర్తి, డీఎస్పీలు సుబ్బారావు, శివాజీ రాజు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.