గుంటూరులో తల్లి, కుమారుడిపై దాడి

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న తల్లి, కుమారుడు పై ఓ పార్టీకి చెందిన నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. దీపావళి సందర్భంగా రాత్రి బయట టపాసులు కాలుస్తున్న తల్లి, కుమారుడు పై నరేందర్ రెడ్డి దౌర్జన్యానికి దిగి ఇంట్లోకి చొరబడి దాడిచేశాడు. ఈ ఘటనపై తల్లి, కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్