తాడేపల్లి: ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న వరద

తాడేపల్లి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువన పులిచింతల ప్రాజెక్టు ప్రధాన వాగుల నుంచి 84, 280 క్యూసెక్కుల వరదనీరు శనివారం ప్రకాశం బ్యారేజి వద్దకు చేరుతున్నట్లు నీటిపారుదల శాఖ జేఈ రాజేశ్ తెలిపారు. బ్యారేజి రిజర్వాయర్లో 12 అడుగుల నీటి మట్టం కొనసాగుతుండగా 40 గేట్లను 2 అడుగులు, 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు 77, 750 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని అధికారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్