గుంటూరు: అలసత్వం ప్రదర్శించిన పాఠశాల యాజమాన్యానికి నోటీసులు

తెనాలి ప్రైవేట్ పాఠశాలలో కిటికీ అద్దాలు మీదపడి గాయపడిన విద్యార్థికి వైద్య ఖర్చులను యాజమాన్యం భరించేలా చర్యలు చేపట్టామని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రక్షణ చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించిన పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. పాఠశాల గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్