భీమడోలు: మూడు రోజుల్లో మూడు లక్షలు రికవరీ

భీమడోలులో అప్పుడే బ్యాంకులో డబ్బులు డ్రా చేసిన మహిళ నుంచి ₹. 3 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే స్పందించారు. కేవలం మూడు రోజుల్లోనే భీమడోలు సీఐ విల్సన్ నేతృత్వంలోని పోలీసు బృందం దొంగను పట్టుకుని దోచుకున్న మొత్తాన్ని తిరిగి బాధితులకు శనివారం అందించారు. తన డబ్బును రికవరీ చేయడంలో వేగంగా చర్యలు తీసుకున్న పోలీసులకు మహిళ కృతజ్ఞతలు తెలిపింది.

సంబంధిత పోస్ట్