తిరుమల లడ్డు కల్తీ నెయ్యి గుట్టు రట్టు చేయడానికి సిట్ రంగంలోకి దిగింది. సిట్‌లోని ఒక బృందం వైష్ణవి డెయిరీకి, మరో బృందం తమిళనాడులోని దిండుగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీకి, ఇంకోటి చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్‌లో విచారణ చేశాయి. ఇదే సమయంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీపై ప్రత్యేకంగా టీం సభ్యులు ఫోకస్ చేశాయి. ఈ క్రమంలో సిట్ చేతికి కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది.