పంచారామ పుణ్య క్షేత్రమైన సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో వెంచేసియున్నా బాలా త్రిపుర సుందరి అమ్మవారికి దేవీ శరన్నవరాత్రి పూజలలో భాగంగా శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చేరుకోరి రాంబాబు వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు చేసారు. అమ్మవారిని నూతన పట్టు చీరతో సర్వ సుందరంగా అలంకరించారు. జిల్లా నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించారు.