రాజమండ్రి నగరంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను సీసీ కెమెరా ద్వారా నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ కార్గ్ పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా నీటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.