తూర్పు గోదావరి జిల్లా నైపుణ్య అధికారిగా ఇటీవలె నూతనంగా గంటా సుధాకర్ పదవీ భాద్యతలు స్వీకరించారు. బుధవారం రాజమండ్రిలోని నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ ప్రాంగణంలోని స్కిల్ కాలేజ్‌ను, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలోని స్కిల్ హబ్‌ను సందర్శించారు. అక్కడ శిక్షణ పొందుతున్న వారితో ఆయన చర్చించి శిక్షణ తీరుపై వివరాలు తెలుసుకున్నారు.