రాజమండ్రి: ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకం

రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీసు అమరవీరుల దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్