పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించే దీపావళి మందుగుండు సామగ్రికి దూరంగా ఉందామని మున్సిపల్ కమిషనర్ వెంకటరావు పిలుపునిచ్చారు. తుని పట్టణ మార్కెట్లో ప్రజలకు బుధవారం ఈ దీపావళి సామగ్రిపై అవగాహన కల్పించారు. పర్యావరణానికి పొగతో హాని కలిగించే దీపావళి సామగ్రికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ప్రతిజ్ఞ సైతం కమిషనర్ మున్సిపల్ ఉద్యోగులతో కలిసి చేశారు.