సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామం పల్లవపాలెం ఉన్న ఫిషింగ్ హార్బర్ ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు హార్బర్ లో కనీస విద్యుత్ సదుపాయం, మంచి నీటి సౌకర్యం కూడా లేవని, ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 300-400 బోట్ లు ఇక్కడికి వస్తాయని ఎమ్మెల్యేకి వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో వీటికి పరిష్కార మార్గాలను చూపుతానని వారికి భరోసా ఇచ్చారు.