రాజోలు: జనవాసాలలో మద్యం షాపు వద్దు అంటూ నిరసన

55చూసినవారు
జనావాసాల నడుమ మద్యం దుకాణం పెట్టవద్దు అంటూ బుధవారం రాజోలు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద రాజోలు పట్టణ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలనకు విరుద్ధంగా రాజోలు భారంవారి వీధిలో ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడం తగదని నినాదాలు చేశారు. గుడి, బడి, జనావాసాలకు దూరంగా మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్