కాతేరులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం

రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో శాంతినగర్ సచివాలయం వద్ద శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. గత ప్రభుత్వంలో దాదాపు రూ. 11 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్