తుని సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే చర్చ

పుష్కర కాలువ పూడిక తీసే పనులు వెంటనే చేపట్టాలని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య గురువారం అసెంబ్లీలో చర్చించారు. తుని నియోజకవర్గంలో పుష్కర కాలువ ద్వారా 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తుని నియోజకవర్గంలోని గవరపేట, హంసవరం, తిమ్మాపురం, చామవరం, అనూరు, ఎస్ అన్నవరం గ్రామాల్లో కాలువలు మట్టితో పూడుకుపోయాయన్నారు. వెంటనే పూడిక పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆమె సభా పూర్వకంగా కోరారు.

సంబంధిత పోస్ట్