తుని: మత్తుపదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు

యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని తుని పట్టణ సీఐ గీతారామకృష్ణ అన్నారు. వివేకానంద కాలేజీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు, ఈవ్ టీజింగ్ పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం నేరమని, ఎవరైనా ర్యాగింగ్ చేసినట్లైతే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. యువత లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్