తుని: తలుపులమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో గల తలుపులమ్మను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సోమవారం దర్శించుకున్నారు. తొలుత అమ్మవారి సన్నిధికి చేరుకున్న ఆయనకు వేదపండితులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఈవో విశ్వనాథరాజు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్