గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా పని చేస్తానని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజక వర్గంలో రహదారులు, డ్రైన్లు అభివృద్ధి కోసం వివిధ ప్రణాళికలను ప్రభుత్వానికి అందించి ఆ దిశగా నిధులను కేటాయించేలా ఒత్తిడి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు.