మచిలీపట్నం: దీపం - 2 పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ ఇనుకుదురుపేటలో ఏర్పాటు చేసిన దీపం-2 పథకాన్ని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని మంత్రి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్