హెల్మెట్ ధరించి ప్రాణాలు నిలుపుకో అనే నినాదంతో హెల్మెట్ ధారణ ఆవశ్యకతను తెలియజేస్తూ శనివారం కృష్ణా జిల్లా పోలీసులు మచిలీపట్నంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయల్ ఇన్ ఫీల్డ్స్ (బుల్లెట్ బండ్ల)తో హెల్మెట్ ధరించి పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ప్రారంభించారు. ఎస్పీ కూడా హెల్మెట్ ధరించి బుల్లెట్ బండిని నడిపి హెల్మెట్ ధారణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.