స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని వేడుకోలు

ప్రజలకు గ్రామపంచాయతీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పెడన నియోజకవర్గ పరిధిలోని ఇంతేరు గ్రామంలో పంచాయతీ కుళాయిల ద్వారా వచ్చే నీరు మురికిగా రావడంతో ఇంటిలోకి వినియోగించడానికి ఇబ్బంది పడుతున్నట్లు ప్రజలు శుక్రవారం వాపోయారు. ఈ నీరు పశువులు తాగడానికి తప్ప మనుషులకు ఉపయోగపడవని, తక్షణమే పంచాయతీ వారు స్పందించి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్