పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన పాండ్రాక వైన్స్ సిబ్బంది చేతివాటం ప్రదర్షిస్తున్నారు. రూ. 150 ఖరీదు చేసే క్వార్టర్ బాటిల్ ను 200 అమ్ముతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ షాపులు ఈనెల 10వ తేదీతో రద్దు కానున్న విషయం తెలిసిందే. ఈలోగా ఉన్న సరుకును సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారని పలువురు మద్యం ప్రియులు మంగళవారం రాత్రి పేర్కొన్నారు.