మతపరంగా సామరస్యంగా ఉన్నాము: ముస్లింలు

పెడన పట్టణంలోని హిందువులు, ముస్లింలు సామరస్యంగా ఉంటున్నామని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. ఆదివారం పెడనలోని షాదిఖానాలో మీడియాతో మాట్లాడారు. ఈనెల 16వ తేదీన మిలాదున్ నబి పండుగ సందర్బంగా కుర్రాళ్లకు మధ్య చిన్నపాటి వివాదం నెలకొందన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారని తెలిపారు. ముస్లింలు, హిందువులకు మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు.

సంబంధిత పోస్ట్