వైసిపి ప్రభుత్వం ప్రజలను మోసగించింది: ఎమ్మెల్యే

గత వైసిపి ప్రభుత్వం ప్రజలను మోసగించిందని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అభివృద్ధి కంటికి కూడా కానరాలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ప్రజల మీద భారాలు వేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్