ఎస్ కోట మండలం బొడ్డవరలోని ఎంపీపీ పాఠశాలను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిని తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించి, తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. మధ్యాహ్న భోజనం అమలు తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.