ఒంగోలు: కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ఒంగోలు కలెక్టరేట్ లోని జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరి సమస్యను వెంటనే పరిష్కరించాలని అక్కడ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. అప్పటివరకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను సిబ్బంది నమోదు చేసిన తీరును వారు పరిశీలించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్న విధానాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్