ఒంగోలు: ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్

ఒంగోలులోని 14వ డివిజన్ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని శనివారం రాత్రి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలో ఉన్న రేషన్ సరుకులను తనిఖీ చేశారు. ఎక్స్పైర్ అయిన సరుకులు, పురుగులు పట్టిన సరుకులను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే నిర్వాహకులు నిర్లక్ష్యం వహించడం పై అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్