కోవూరు: విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 5 లక్షల ఆర్ధిక సహాయం

కోవూరు గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం కార్యకర్త నిక్కుదల నాగేశ్వరరావు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. వైద్యం అందించాలంటే 25 లక్షలు అవసరమవుతోందని డాక్టర్లు చెప్పారు. శనివారం వేమిరెడ్డి దంపతులు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని నెల్లూరులో అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి మరో ఎనిమిది లక్షల సహాయానికి విపిఆర్ దంపతులు కృషి చేశారు.

సంబంధిత పోస్ట్